ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైసీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ నారా చంద్రబాబు డబ్బుకు ఆశపడి టీడీపీలో చేరారు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు.
see also:2019లో ఆ జిల్లా కూడా వైసీపీ ఖాతాలోకే..!
అయితే తాజాగా సర్వేలకు సీఎం చంద్రబాబు షాక్ అయినట్టు తెలుస్తుంది. టీడీపీలోకి జంప్ అయిన 22మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు 20 మంది ఓటమి చెందడం ఖాయమని ఓ సర్వేలో వెల్లడైంది. 2019 ఎన్నికల్లో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధిస్తారని సర్వేలో వెల్లడైంది. ఈ ఇద్దరూ కూడా మంత్రలే కావడం గమనార్హం. ఇప్పుడు ఈ వార్త ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి ఇది చేదు వార్తే. ఫలితాల ప్రకారం కేవలం ఇద్దరు మాత్రమే బయటపడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గెలుపు చాన్స్ ఉన్న వారిలో ఇద్దరు కూడా మంత్రులే. అందులో ఒకరు విజయనగరం జిల్లాలోని బొబ్బిలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుజయ కృష్ణరంగారావు ఒకరు. మరొక మంత్రి చిత్తూరు జిల్లాలోని పలమనేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమరనాధ్ రెడ్డి ఉన్నారు. వైసీపీ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు గురించి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు లభిస్తే అన్న ప్రాతిపదికపైనే ఈ సర్వే నిర్వహించినట్లు ప్రచారం జరుగుతుంది.
see also:నన్ను ఎత్తుకో జగన్ మామయ్య..!!