సనత్ నగన్ ఈఎస్ఐ వైద్యశాలలోగత కొన్నిరోజులుగా నిరసనకార్యక్రమాలు చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ కు మద్దతు ప్రకటిస్తూ వారి న్యాయమైన డిమాండ్లను సహృదయంతో పరిశీలించి న్యాయం చేయాలని అదే విధంగా 1) వారి జీతభత్యాలు సమయానికి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని2) ప్రసూతి సెలవులు ఆరు నెలలు ఖచ్చితంగా అమలు చేయాలి..3) సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలి మాట్లాడిన
నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ .NOA సభ్యుడు Laxman Rudavathఅదే విధంగా రాష్ట్రంలో పనిచేస్తూన్నా నర్సింగ్ ఆఫీసర్స్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్యశాలలో పనిచేసే నర్సెస్ అందరూ ఏకం కావలిసిన సమయం ఆసన్నమైంది ..అందరూ ఏకం అయ్యి మనకు రావలసిన న్యాయమైన డిమాండ్లను సాదించుకోవాలి అదే విధంగా ప్రజారోగ్యంకోసం అహర్నిశలు కృషి చేస్తున్నా మన నర్సెస్ కు వారి ఆరోగ్యం క్షీణీస్తే కనీస భరోసా ప్రభుత్వం నుండి లేదు.రాబోయే ఎన్నికల్లో ఏ రాజకీయపార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో నర్సింగ్ సమాజం కోసం తీసుకోబోయే చర్యలు స్పష్టంగా ప్రకటిస్తారో వారికే మన నర్సింగ్ సమాజం మద్దతు తెలిపాలి అనిఅదే విధంగా నర్సింగ్ సమాజం గొంతుక ప్రజా క్షేత్రంలో వినిపించాలి..
see also;సీఎం సవాలును స్వీకరించిన ఉత్తమ్..!!
దాదాపుగా లక్షన్నర నర్సింగ్ కుటుంబాలు..ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి..అయినా మన నర్సింగ్ సమాజం గురించివ్వరు పాటించుకొన్న పాపాన పోలేదు..ప్రజారోగ్యంను కాపాడుతున్న మన నర్సింగ్ కుటుంబాలకు వారి ఆరోగ్యమును కాపాడుకొనే స్థోమత లేదు..సమైక్య రాష్ట్రంలోనే కావచ్చు…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కావచ్చుఏ ప్రభుత్వం కూడా నర్సింగ్ సమాజం గురించి కానీ వారి కుటుంబాల గురించి కానీ వారికోసం అంటూ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదు..వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న మన నర్సెస్ కి హెల్త్ కార్డులు లేవు..
కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న మన నర్సెస్ యొక్క బాధలు వర్ణనాతీతం అలాగే రెండవ ANM లు
ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వ ఆరోగ్య పథకాలుగురించి అవగాహన కలిపిస్తున్నారు.ఈ రోజు ఆరోగ్య పథకాలు అంతగా ప్రజల వద్దకు చేరవేయడం లో వీరి పాత్ర ఎనలేనిది..కానీ వీరి గోస ఏ అధికారులకు గాని నాయకులకు గాని.. కనబడదు..
see also:గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి హరీష్..!!
అలాగే యూరోపియన్ నర్సెస్ యొక్క బాధలు చెప్పుకొంటే చాటేడంతా..NRHM & NHS , PUBLIC HEALTH , TVVP, ఈ రోజు ఇన్ని శాఖలలో ప్రజారోగ్యం కోసం పనిచేస్తున్న మన నర్సెస్ కంటూ ఒక ప్రత్యేక నర్సింగ్ డైరెక్టరేట్ కానీ.మన నర్సస్ యొక్క యోగక్షేమాలు చూడడానికి ఒక ప్రత్యేక విధానం అంటూ లేదు.విధి నిర్వహణలో తమ ప్రాణాలు సైతం కోల్పోతున్న మన నర్సెస్ కి ఆదరణ ఏది?మన నర్సెస్ అనారోగ్యానికి గురియితే వారివద్ద చికిత్సకు సరిపడా ఆర్థిక స్థోమత లేక ప్రాణాలు కోల్పోతున్నారు..అందుకే అడుగుతున్నాం స్పష్టంగాఒక లక్షన్నర నర్సింగ్ కుటుంబాలు × కుటుంబానికి నాలుగు ఓట్ల చోపున్న వేసుకున్నా.. = దాదాపుగా అరులక్షల ఓటుబ్యాంకు మన నర్సింగ్ కుటుంబాలది.మరి ఏ రాజకీయ పార్టీ మా నర్సింగ్ కుటుంబాల మరియు మా నర్సింగ్ సమాజం కోసం ..తీసుకోబోయే చర్యలను తమ ఎన్నికల ప్రణాళికలో పొందుపరచి చిత్తశుద్ధితోఅమలు చేస్తాము అని ప్రజాక్షేత్రం లో హామీ ఇస్తాయో..వారిని మన నర్సింగ్ కుటుంబాలు నర్సింగ్ సమాజం ఆదరించాలి..మన నర్సస్ కుటుంబాలు అడుగుతున్నా న్యాయమైన డిమాండ్లు.
see also:ఉద్యమకారుడికి దక్కాల్సింది గౌరవం..నాయకుడికి దక్కాల్సింది పదవి..!!
1.సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రవేట్ ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్ నర్సెస్ కు కనీస వేతనo 20,000/-ఇవ్వాలి.వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కమిటి వేసి,ఆ కమిటిలో నర్సింగ్ ఆఫీసర్ కు అవకాశం కల్పించాలి.
2.మన రాష్ట్రములో జెండర్ తో సంబంధ లేకుండా మేల్ నర్సెస్ కూడ ఫిమేల్ నర్సెస్ తో పాటు సమానంగా ఉద్యోగ మరియు ఉన్నత విద్య కు అవకాశాలు కలిపించాలి.
3.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలి.అలాగే కాంట్రాక్టు నర్సింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి.ఉన్నవారిని రెగ్యులరైజ్ చేయాలి.
4. ప్రభుత్వ మరియు ప్రేవేటు ఆసుపత్రిలలో పని చేసే ప్రతి నర్సింగ్ ఆఫీసర్ కు ఉద్యోగ మరియు ఆరోగ్య భద్రతా కల్పించాలి.
5.రాష్ట్రంలో నర్సింగ్ డైరెక్టర్ ను ఏర్పాటు చేయాలి.
6.రాష్ట్రములోచదువుతున్న ప్రతి నర్సింగ్ విద్యార్ధి కి 2017 సంవత్సరం నుoడి కాలేజీ ఫీజు పెంచిన విధము గానే నర్సింగ్ విద్యార్ధులకు స్కాలర్ షిప్స్ మరియ స్టెపంఢ్ వెంటనే పెంచాలి.
7. నర్సింగ్ కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.
8. ప్రజాక్షేత్రంలో నర్సింగ్ సమాజం గొంతుక వినిపించుటకు MLC సీటును కేటాయించాలి
9. కేంద్ర సర్కారు సవరించిన హోదాను స్టాఫ్ నర్సు నుంచి నర్సింగ్ అధికారిగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ ఉత్తర్వులను నేటి వరకు ఎందుకు అమలు చేయడం లేదు.. ఈ ఉత్తర్వులను అమలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద నయా పైసా ఖర్చు ఉండదు..అయినా అమలు చేయడం లేదు.
see also:ఒకే వేదికపై మంత్రి కేటీఆర్,రానా,నాగచైతన్య ,విజయ్ దేవరకొండ..!!
10. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన నర్సింగ్ డైరెక్టరేట్ నేటి వరకు ఎందుకు శంకుస్థాపనకు నోచ్చుకోవడం లేదు.
వైద్య శాఖలోనే..పనిచేస్తున్న నర్సెస్ కి హెల్త్ కార్డులు ఉండవు..విదినిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాలను ఆదుకునే నాధుడే కరువు.ప్రజారోగ్యంను కాపాడుతున్న నర్సెస్ కి వారి ఆరోగ్యం విషయంలో భరోసా లేదు..గతవారములోనే ఒక నర్స్ కు కాన్సర్ వస్తే వైద్యం చెప్పించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక ప్రాణాలు కోల్పోయింది..ఇలా జరగకుండా ఉండేందుకు…గట్టిచర్యలు తీసుకోవాలి..