ఏపీలోని కర్నూలు జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబంపై జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. వైసీపీ పార్టీని అన్ని వర్గాలు తమ సొంత పార్టీలా భావించాయి. అందుకే అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు లొంగలేదు. టీడీపీ కాంగ్రెస్ నాయకులు కోట్లాది రూపాయలు పంచినా ప్రజాబలం ముందు అవేమీ పనిచేయలేదు. పాలక, ప్రతిపక్షాలు ఏకమై జగన్‌పై చేసిన అసత్య ఆరోపణలను ప్రజలు ఓటుతో తిప్పికొట్టారు. కేఈ ఫ్యామిలీకి కంచుకోట డోన్ నియోజకవర్గం అని తెలిసిందే. అయితే 2014 ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో వైసీపీ నేత, ప్రస్తుత డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాడు.
see also:
కేఈ కృష్ణమూర్తి, ఆయన సోదరుడు ప్రభాకర్‌లకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గంపై వైసీపీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతోనే జగన్.. ముందుగానే తమ పార్టీ అభ్యర్థిగా బుగ్గనను ప్రకటించడం అప్పట్టో ఒకసంచలనం.అయితే అదే నమ్మకంతో గడిచిన ఎన్నికల్లో డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాడు. ఇప్పటికే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తనదైన పాలనతో.. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం చేస్తున్న తప్పులను లెక్కలతో సహా బట్టబయలు చేస్తూ చంద్రబాబు సర్కార్‌కు చుక్కలు చూపిస్తూ ప్రజల్లో మంచి పేరును సంపాదించుకున్నాడు. అందులోనూ వైఎస్ జగన్‌కు మంచి మిత్రుడు కూడాను. కనుక మళ్లీ ఆయనే డోన్ నియోజకవర్గంలో వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా విజయ ఢంకా మోగించనున్నారు.
see also:టీడీపీ అధికారంలోకి వచ్చాక ..అనేక మంది వైసీపీ కార్యకర్తలపై దాడులు
మరోపక్క..
ఇటీవల వైఎస్ జగన్ పాదయాత్రలో భాగంగా పత్తికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున దివంగత నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి భార్య శ్రీదేవిని బరిలోకి దించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. జగన్ తీసుకున్న నిర్ణయంతో కేఈ కుటుంబం కాస్త కలవర పడుతుండటంతో పాటు.. కర్నూలు జిల్లా వైసీపీ కార్యకర్తల్లో నూతనోత్సాహానికి నాంది పలికింది. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కర్నూల్ జిల్లా కృష్ణగిరిలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈ మేరకు పత్తికొండ నుంచి వైసీపీ తరపున దివంగత నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి భార్య శ్రీదేవిని బరిలోకి దించనున్నట్లు ప్రకటించారు. శ్రీదేవిని మెజారిటీలో గెలిపించాలని జగన్ ప్రజలను కోరారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చింది.అయితే, మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆయన సోదరుడు ప్రభాకర్‌లకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గంపై వైసీపీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతోనే జగన్.. ముందుగానే తమ పార్టీ అభ్యర్థిగా శ్రీదేవిని ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతుకాదు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా టీడీపీ జెండాను ఎగురవేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ నుంచి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకూ పత్తికొండ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా వ్యవహరిస్తూ వస్తోంది.
see also:జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన వెంకయ్య నాయుడు..!
గత ఎన్నికల్లో శ్రీదేవి భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమిపాలయిన విషయం విధితమే. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. కానీ, ఏడాది క్రితం ఆయన్ను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలోనే నారాయణ కుటుంబంలో ధైర్యం నింపేందుకు వైఎస్ జగన్ శ్రీదేవిని పత్తికొండ నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పత్తికొండ టిక్కెట్ కోసం ఎదురు చూస్తున్న కేఈ ఫ్యామిలీకి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. దీనికి కారణం పత్తికొండ నియోజకవర్గంలో కేఈ కృష్ణమూర్తి కుటుంబం చేస్తున్న ఆగడాలు వెలుగులోకి రావడమే. దీంతో ప్రస్తుత ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబుకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు విముఖత చూపుతున్నట్లు సమాచారం.
see also:బిర్యాని బాలేదని రాడ్‌లతో టీడీపీ నేత దాడి..!
అదే విధంగా డోన్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తోన్న కేఈ కృష్ణమూర్తి సోదరులు కేఈ ప్రతాప్, కేఈ ప్రభాకర్‌లకు చంద్రబాబు టిక్కెట్ ఇచ్చినా… ఇప్పటికే అక్కడ బుగ్గన రాజారెడ్డి ఎమ్మెల్యేగా ఉండటం.. అందులోను ప్రజల్లో మంచి నేతగా పేరు సంపాదించుకోవడంతో టీడీపీ కంచుకోటను వైసీపీ కంచుకోటగా మార్చారు. కనుక కేఈ కుటుంబానికి గెలిచే అవకాశం లేదు. కనుక కేఈ కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. మరో ఇద్దరికి టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ కంచుకోట అయిన పత్తికొండ నియోజకవర్గన్ని వైసీపీ బద్దలు కొట్టడం ఖాయం.