ప్రభుత్వ కార్యాలయాల్లో ఏమైనా పని ముందుకు వెళ్ళాలంటే లంచం ఇవ్వాల్సిందే..ఇది ఒక్కప్పటి మాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తరువాత లంచం తీసుకోవాలంటనే అధికారులు భయపడుతున్నారు.స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం లంచాన్ని లంచాన్ని అరికట్టే పనిలో పడింది . ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లంచం అడిగితే వెంటనే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అవినీతి నిరోధకశాఖ (ACB) డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి ప్రజలకు కోరారు. ఉద్యోగుల అవినీతి సమాచారం ఇచ్చేవారి వివరాలను రహస్యంగా ఉంచుతామన్నారు. లంచం ఇవ్వడం .. తీసుకోవడం నేరమన్నారు. ప్రజలు లంచం ఇవ్వకుండా ఫిర్యాదు చేసి సహకరించినప్పుడే తాము సమర్థవంతంగా పనిచేస్తామన్నారు.
