స్టార్ హీరోయిన్ సమంతకు ఇప్పుడు కావాల్సినంత టైమ్ దొరికింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన రంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సమంత ఎంతో హ్మప్పీ మూడ్‌లోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా, తమిళ్ హీరో విశాల్‌తో కలిసి నటించిన అభిమన్యుడు చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టడంతో సమంత ఫుల్ ఖుషీలో ఉంది. మరో పక్క నాగచైతన్యతో కలిసి నటిస్తున్న చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. ఇంకేముందీ, నిజజీవితంలో భార్యాభర్తలైన అక్కినేని నాగ చైతన్య, సమంత చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు.
see also:రేణూ దేశాయ్ రెండో పెళ్ళిపై మొదటిసారిగా స్పందించిన పవన్
తాజాగా ఈ జంట ఓ ఫేమస్ రెస్టారెంట్‌లో సందడి చేసింది. పార్టీకి వచ్చిన వారిద్దరూ బ్లాక్ డ్రస్‌ను ప్రిఫర్ చేయడంతో చూపరులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనూ ఇద్దరూ డైట్ రూల్స్ బ్రేక్ చేసి మరీ ఫుడ్‌ను లాగించేశారట. సెమీ చాక్లెట్ క్రీమ్ కేక్, బెల్జియం డ్రాగ్ చాక్లెట్, ఇటాలియన్ కు సంబంధించిన కుకీస్ ఇలా అన్ని రకాల పదార్థాలను టేస్ట్ చేశారట. టన్నుల కొద్దీ క్యాలరీలు ఉన్న స్వీట్స్, కేక్స్‌ను లాగించేశారట. ఇంత వరకు బాగానే ఉన్నా.. వీరి జోరు చూసి నిర్మాతలు షాక్ తింటున్నారట. అందుకు కారణం వీరితో కొన్ని ప్రాజెక్ట్‌కు కమిట్ కావడమే. ఇలా డైట్ పాటించకుండా ఇష్టమొచ్చిన రీతిలో లాగించేయడంతో.. సమంత ఎక్కడ లావైపోతుందోనని నిర్మాతలు తెగ బాధపడిపోతున్నారట. ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో సమంత నాజూకైన అందంతో వెండితెరపై కనిపించిన విషయం తెలిలిసిందే. ఇలా ఇష్టమొచ్చిన రీతిలో ఫుడ్ లాగించేస్తుండటంతో సమంత మళ్లీ వెండితెరపై అలానే కనిపిస్తుందో..? లేదో..? నని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారట.