అమెరికాలో అవకాశాల కోసం అందమైన యువతులను ఎరవేసి, వ్యభిచారం చేస్తూ అడ్డంగా చికాగో పోలీసులకు దొరికి పోయి కటకటాలపాలైన నిర్మాత కుటుంబ వ్యవహరం ఇటివల వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు వాళ్లతో ఎవరెవరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై అక్కడి పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు. సెక్స్ రాకెట్ పై దర్యాప్తులో భాగంగా అమెరికా పోలీసులు రీసెంట్ గా మెహ్రిన్ కౌర్ షూటింగ్ నిమిత్తం వెళ్లగా ఆమెను కొంత సేను రక రకాల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. తర్వాత షూటింగ్ కోసం వచ్చారిన క్లారిటీ తీసుకున్న తర్వాత విడిచి పెట్టిన సంగతి తెలిసిందే.
see also:విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్..!!
అంతే కాదు వివిధ తెలుగు అసోసియేషన్ల ఆహ్వానాలతో అమెరికా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుంటున్న వారు యూఎస్ కాన్సులేట్ కార్యాలయంలో తిరస్కరణకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం, అంటే 22వ తేదీన అమెరికా వెళ్లేందుకు బీ1బీ2 (ట్రావెల్ వీసా) వీసా నిమిత్తం డ్యాన్సర్, టీవీ నటి సురేఖా రాణి యూఎస్ కాన్సులేట్ కు ఇంటర్వ్యూ నిమిత్తం వెళ్లారు. అమెరికాకు ఎందుకు వెళుతున్నారని అడుగగా, ‘ఆటా సదస్సు కోసం’ అని ఆమె చెప్పగానే తిరస్కరణకు గురైంది. అంతే కాదు వీసాలను తిరస్కరిస్తున్న పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని, తానా, ఆటా, నాటా సదస్సులకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునే వారిలో 75 శాతం మంది వరకూ వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వీసాలిస్తుంటారని, ఇప్పుడు 90 శాతం మందికి వీసా ఇచ్చేందుకు కాన్సులేట్ నిరాకరిస్తోందని అధికారులు వెల్లడించారు.