కడప ఉక్కు పరిశ్రమ కోసం వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేపట్టిన 48 గంటల నిరహార దీక్ష పూర్తైంది. గురువారం ప్రొద్దుటూరులో ఆయన దీక్షను విరమించారు. కడప ఉక్కు-రాయలసీమ హక్కు అనే నినాదంతో పరిశ్రమ స్థాపన కోసం జిల్లాలోని ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తామని రాచమల్లు ప్రకటించారు.
see also:వైఎస్ జగన్ 195వ రోజు పాదయాత్ర.. 2,400 కిలో మీటర్లు
ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయడానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు. టీడీపీతో రాజీనామాలు చేయించే బాధ్యతను అఖిలపక్షం తీసుకోవాలన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ రాకపోవడానికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేనని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎందాకైనా పోరాటం చేస్తామని అన్నారు.
see also:వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి నోటీసులు .!
స్టీల్ ప్లాంట్ గురించి నాలుగేళ్లుగా మాట్లాడని తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికిప్పుడు దీక్షలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కేవలం ఓట్లు కోసమే టీడీపీ మొసలి కన్నీరు కార్చుతోందని ఆరోపించారు. స్వార్థ రాజకీయాల పేరుతో దొంగ దీక్షలు చేపట్టి రాయలసీమ ప్రజలను మోసగించొద్దు. ఈ నాలుగేళ్లలో మీ పుణ్యమా? అని రాయలసీమ నాశనం అయిందని, ఈ ప్రాంత అభివృద్ధి అంశాలపై ఏ చర్చకైనా సిద్ధమా? టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. రాయలసీమ ప్రాంతాన్ని నాశనం చేయడానికి కడపను వేదికగా చేసుకుని రాజకీయాలు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.దీనిని తిప్పి కొట్టడానికి రెండు కోట్ల జనాభా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. అంతేకాదు సీఎం రమేష్ కాంట్రాక్ట్ ల కోసం కపట నాటకం అడుతున్నారని ఆయన అన్నారు. నాలుగేళ్లుగా ఉక్కుఫ్యాక్టరీ గురించి ఏ మాత్రం పట్టించుకోని మీరు ఇప్పుడు తగుదునమ్మా అంటూ దీక్షలు చేయడం సిగ్గు అనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు.