ఏపీలో పెను సంచలనం.. చికాగో సెక్స్ రాకెట్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అత్యంత సన్నిహితుడు. అవును. ఇటీవల టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన చికాగో సెక్స్‌రాకెట్‌లో చంద్రబాబు, లోకేష్‌లకు అత్యంత సన్నిహితుడైన తానా అధ్యక్షుడు వేమన సతీష్ వేమన ప్రేయం ఉందని, అందులో భాగంగానే చికాగో పోలీసులు వేమన సతీష్‌ను విచారించినట్టు తెలుస్తోంది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలని వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.
see also:నటి యమున సంచలన వ్యాఖ్యలు..!
కాగా, ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చికాగో సెక్స్‌రాకెట్‌పై పలు విషయాలు వెల్లడించారు. గతంలో ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపిన కాల్‌మనీ సెక్స్‌ను ప్రశ్నించినందుకుగాను వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఒక మహిళ అని కూడా చూడకుండా ఏడాదిపాటు సస్పెండ్ చేశారే..? ఇప్పుడు మీకు అత్యంత ఆప్తుడు, సన్నిహితుడైన వేమన సతీష్ చికాగోలో సెక్స్‌రాకెట్‌లో భాగంగా పోలీసులు విచారించడంపై మీరు స్పందించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు, లోకేష్‌లకు చురకలంటించారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో టీడీపీ నేతలు ఉన్నందునే .. ఆ కేసును నీరుకార్చారని వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ విమర్శించారు.