ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వేదగిరి మండలంలో జానపాడు, తమ్మిలేరు యాక్టివేట్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పోలవరం సినిమా చూపిస్తున్నాడని జగన్ అనడం సరికాదన్నారు.
see also:చంద్రబాబు పై దుమ్ములేపుతున్న పాట..!!
రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు పనిచేస్తున్నారని, కానీ, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మాత్రం అభివృద్ది పనులకు నిత్యం అడ్డుపడుతున్నారన్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. నిర్మాణ దశలో ఉన్న ఒక ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది కేవలం చంద్రబాబు సర్కార్ మాత్రమేనన్నారు. అటువంటిది ప్రతీ శుక్రవారం కోర్టులకు వెళ్లే జగన్ చంద్రబాబును విమర్శిస్తాడా..? చంద్రబాబును విమర్శించే ముందు నీ కుటుంబ నేపథ్యం ఏమిటో గుర్తు చేసుకో అంటూ జగన్‌కు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు హితవు పలికారు.