రేసుగుర్రం, సరైనోడు తరువాత స్టైలిష్ స్టార్ బన్నీకి ఆ స్థాయి హిట్స్ పడలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న నా పేరు సూర్య చిత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఈ సారి కొడితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకుని మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాకు కూడా కమిట్ కాలేదు. సాధారణంగా ఆయన స్థాయి హీరోలంతా ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే.. మరో సినిమాకు సైన్ చేయడం వంటివి చేస్తారు. అయితే, బన్నీ సినిమా విడుదలై నెల రోజులు గడిచినా ఇంకా ఏ ప్రాజెక్టుకు కమిట్ కాలేదు.
see also:చికాగో సెక్స్‌రాకెట్‌పై శ్వేతాబసు ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..!
పలువురు దర్శకులు, నిర్మాతలు ఆయన్ను కలిసి కథల మీద కథలు చెబుతున్నా దేనికి కూడా సాటిస్‌ఫై కావడం లేదు. సినిమా మొదలు పెట్టడం కాస్త లేటైనా మంచిదే.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే సినిమాలోనే నటించాలని బన్నీ డిసైడయ్యాడట. దర్శకుడు విక్రమ్ కే కుమార్ చెప్పిన స్టోరీ బన్నీకి నచ్చినా.. ఆ స్టోరీని బన్నీ ఇంకా ఫైనల్ చేయలేదని సమాచారం.