టాలీవుడ్ నటీమణులు ఆట బొమ్మలుగా మారుతున్నారా.? అమెరికాలో అసలేం జరిగింది..? సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? ఇప్పుడు ఈ ప్రశ్నలే ప్రతీ సినీ ప్రేక్షకుడిని తొలచివేస్తున్నాయి. మొన్నటి వరకు టాలీవుడ్లో విపరీత స్థాయిలో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉన్నాయంటూ ఉద్యమాలు, పోరాటాలు జరిగిన విషయాన్ని మరిచిపోకముందే.. చికాగో సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. దీంతో టాలీవుడ్తోపటు యావత్ సినీ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
see also:గేయరచయితలకు కూడా తప్పని లైంగిక వేధింపులు ..!
ఈ సెక్స్రాకెట్కు సూత్రదారులైన కిషన్, చంద్రకళ దంపతులను చికాగో పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల విచారణతో కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇదిలా ఉండగా, చికాగో సెక్స్రాకెట్పై రష్మీ స్పందించింది. అమెరికాలో తెలుగు వారు ఇలా వ్యవహరించడం బాధాకరమని విచారం వ్యక్తం చేసింది. సినిమాల్లో అవకాశాలు రాని వారు మాత్రమే ఇలాంటి పనులకు పాల్పడుతుంటారని, వారు చేసిన తప్పుడు పనులను మొత్తం సినీ ఇండస్ట్రీకే ఆపాదించడం సరికాదని తెలిపింది. అయితే, మోదుగుమూడి కిషన్ నుంచి తనకు ఫోన్ వచ్చిన మాట వాస్తవమేనని, మరో సారి ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో.. అప్పట్నుంచి మోదుగుమూడి తనకు ఫోన్ చేయలేదని రష్మీ చెప్పింది.