తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపింది. తెలంగాణలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో నూతనంగా 863 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..ఆ పోస్టుల్లో భాగంగా 616 లెక్చరర్, 15 ప్రిన్సిపల్ సహా పలు ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉద్యోగాలను గురుకుల బోర్డు ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
