తెలుగు చిత్ర సీమలో తాజాగా సంచలనంగా మారింది అమెరికాలో తెలుగు హీరోయిన్స్ సెక్స్ రాకెట్. గత బుధవారం వెలుగు చూసిన ఈ సెక్స్‌రాకెట్ గురించి తాజాగా పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. సినీ ఇండస్ట్రీలో అవకాశాలురాని ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి వర్దమాన నటులను డబ్బు ఆశ చూపి విసిటింగ్ వీసా పేరుతో అమెరికాకు రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతుల గుట్టు రట్టయింది. అందులో భాగంగానే మోదుగుల కిషన్, చంద్రకళలను చికాగో పోలీసులు అరెస్టు చేశారు.
see also:చికాగోలో కోట్లు సంపాదించిన హీరోయిన్..!
మోదుగుమూడి కిషన్, ఆయన భార్య చంద్రకళను అరెస్టు చేయడంతో కథలో ట్విస్ట్ రివీల్ అయింది. వీరిద్దరి వ్యభిచార భాగోతంపై చికాగో కోర్టులో 40 పేజీల ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది. డిసెంబర్ 2017లో అమెరికాకు వెళ్లి వచ్చిన టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోయిన్ కిషన్‌ను వేడుకుంటూ ఓ ఈమెయిల్ రాసింది. ఈ విషయాన్ని చికాగో పోలీసులే బట్టబయలు చేశారు.
see also:ఫైవ్ స్టార్ హోటల్లో.. కక్ష తీరేలా..!
ఆ ఈ మెయిల్‌ను చూసిన పోలీసులు ఆమెను విక్టమ్ ఏగా ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఈమె తన ఈమెయిల్ లేఖలో కిషన్‌ను ఉద్దేశించి ఏమని పేర్కొందంటే..? మీతో కలిసి వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు. గతంలో ఒక సారి వచ్చినప్పుడు వద్దన్నా కూడా ఎనిమిది గంటలపాటు వ్యభిచార కూపంలోకి దింపారు. ఇకపై నాకు ఫోన్ చేయవద్దు. నాకు ఇబ్బందిగా ఉంది. నాకు రావాల్సిన డబ్బులు నా అకౌంట్లో వేసేసెయ్ అని ఉన్న టెక్స్ట్ మెసేజ్‌ను పోలీసులు గుర్తించారు.
see also:ప్రకంపనలు సృష్టిస్తున్న చికాగొ సెక్సరాకెట్ అడియో టేపులు
అయితే, ఆ మెయిల్ కు కిషన్ రిప్లై ని కూడా పోలీసులు కోర్టు ముందు ఉంచారు. అందులో బాధితురాలిని కిషన్ బెదిరించినట్టు ఉంది. అంతేకాకుండా, చంద్రకళ ఓ పద్దుల పుస్తకాన్ని మెయింటెన్ చేసేదని, ఆ పుస్తకంలో ఏఏ హీరోయిన్లు, ఏఏ ప్రాంతంలో, ఎవరెవరితో అన్న అంశాలన్నిటిని కూలంకుషంగా పొందుపరిచి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఈ ఆధారాలే పోలీసులకు కీలకంగా మారబోతున్నాయి.