తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడుల రాక కొనసాగుతోంది. టీఎస్‌ఐపాస్‌తో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా తాజాగా ఫ్రెంచ్ దేశానికి ప్రముఖ కంపెనీ జార్జ్స్ మొనిన్ సాస్ తమ యూనిట్‌ను స్థాపించడానికి ముందుకు వచ్చింది. రూ.100కోట్లతో తమ యూనిట్ స్థాపించనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 200 మందికి ఉపాధి అవకావాలు లభించనున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ , జార్జ్స్ మొనిన్ సాస్ సంస్థ తరుఫున సంస్థ అధ్యక్షులు ఓలీవిర్ మొనిన్ సంతకం చేశారు. ఈ కంపెనీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సిరప్‌లను తయారు యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ కంపెనీకి 106 సంవత్సరాల చరిత్ర ఉంది.
see also:” రైతు బీమా ” పథకం గైడ్ లైన్స్ విడుదల..!!
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కంపెనీ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహాకారాన్ని అందిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై ప్రత్యేక దృష్టి నిలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీని ద్వారా రైతాంగం పండింగే వ్యవసాయ ఉత్పత్తులతో అదనపు ఆహార ఉత్పత్తులను తయారు చేయవచ్చు. రాష్ట్ర ప్రజల అవసరాలతో పాటుగా దేశి, విదేశాలకు ఎగుమతి చేసుకొనే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ కంపెనీ రావడం మరింత ఉత్సాహాన్ని ఇవ్వనుంది. ఈ కంపెనీకి 140 దేశాల్లో మొనిన్ ఉత్పత్తులు విక్రయాలు జరుగుతున్నాయి.
Georges Monin SAS will establish production facilities in Telangana to manufacture gourmet flavours from a wide range of fruits, vegetables, flowers and nuts. 2/2 pic.twitter.com/S4dnn9nO7v
— Min IT, Telangana (@MinIT_Telangana) June 19, 2018
Government of Telangana and Georges Monin SAS signed an MoU in the presence of Minister @KTRTRS today. Georges Monin is a renowned French company that produces flavored syrups for use in foods and beverages. 1/2 pic.twitter.com/X6dVyeiTFD
— Min IT, Telangana (@MinIT_Telangana) June 19, 2018