తన కుమారుడు అకీరాను జూనియర్ పవన్‌కల్యాణ్ అని పిలిస్తే.. వారిని వెంటనే సోషల్‌మీడియాలో బ్లాక్ చేయిస్తానని పవన్ కల్యాణ్ మాజీ భార్య , నటి రేణూ దేశాయ్ స్పష్టం చేశారు..ఈ సందర్భంగా ఆమె ఇవాళ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అకీరా బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ పోస్టులో అకీరా కోపంగా దేని కోసమో వెతుకుతూ కనిపించారు.
నా తనయుడు ఈరోపియన్ సినిమాలోని సీరియస్ పాత్రలా కనిపిస్తున్నాడు.. తన ల్యాప్‌టాప్‌లో ఓ గేమ్ కోసం తీవ్రంగా వెతుకున్న టైంలో క్లిక్‌మనిపించిన ఫోటో ఇది. ఈ ఫోటోకి ఎవరైన జూనియర్ పవర్ స్టార్ అని కామెంట్ పెడితే వారి పోస్ట్‌ని డిలీట్ చేయడంతో పాటు బ్లాక్ చేయడం జరుగుతుంది. అకీరాని జూనియర్ పవర్ స్టార్ అని పిలవడం తన తండ్రికి కాని, తల్లికి కాని, అకీరాకి కాని అస్సలు నచ్చదు. దయచేసి ఎవరు జూనియర్ పవర్ స్టార్ అని పిలవొద్దని ఈ సందర్భంగా రేణూ పేర్కొంది .
see also:‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా విడుదల ఎప్పుడో తెలుసా..?