తనకు లొంగలేదని పంతం పట్టి మరీ చుక్కలు చూపించాడు, తప్పని సరి పరిస్థితుల్లో అంటూ.. ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో పాటలు, మాటలు రచయితగా రాణిస్తున్న శ్రేష్ఠ చెప్పుకొచ్చింది. అయితే, ఇటీవల కాలంలో టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు భరించలేకనే హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే భయపడుతూ తన సొంత ఊరుకు పారిపోయానని చెప్పింది.
see also:నటి సంజన షాకింగ్ కామెంట్స్.. డబ్బు కోసం వ్యభిచారం
తన మొదటి సినిమా ఒక రొమాంటిక్ క్రైమ్ కథ హిట్ అవడంతో తనకు ఇంకొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయని, అయితే, ఆ ప్రాజెక్ట్స్ తెచ్చిన వాళ్లంతా నీకు అవకాశం ఇస్తే నాకేంటి అన్న ఒక్క మాటతోనే వచ్చే వారని, సమస్యలు చుట్టుముట్టడంతో హైదరాబాద్ వదిలేసి వెళ్లిపోయానని తెలిపారు. మాకు మార్కెట్ ఉంది. ప్రముఖ రచయితల వద్ద మాటలు, పాటలు రాయించుకునే డబ్బు మా దగ్గర ఉంది. వారిని కాదని, మీకు ఇవ్వాలంటే.. మాకేంటి అంటూ ప్రాజెక్ట్స్ తేవడంతో తనపై తనకే అసహ్యం వేసిందన్నారు.
see also:త్రిషపై కేసు కొట్టివేత..!
ఓ బఢా నిర్మాత అయితే, ఏకంగా రూముకే వచ్చి డైరెక్టుగా అడిగేశాడని, తాను ఎంతకీ లొంగకపోవడంతో ఆ తరువాతి రోజు నుంచి పంతం పట్టి మరీ చుక్కలు చూపించాడని, ఆ పదం బాగాలేదు, ఈ పదం బాగా లేదంటూ కావాలనే పగపట్టి మరీ తన కోపాన్ని తీర్చుకున్నాడని చెప్పింది రచయిత శ్రేష్ఠ.