దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ..తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం పై మోదీ ప్రశంసల జల్లు కురుపించారు.అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉండగా తరువాతి స్థానం లో మధ్యప్రదేశ్ ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా అభిప్రాయపడినట్టు తెలిసింది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ పాటు మిగతా 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
see also:దశాబ్దాల భూ వివాదాలకు పరిష్కారం….మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం
ఈ సమావేశంలో రెండురాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాలకు ప్రయోజనాలు కల్పించాలని, అదనపు రాయితీలు ఇవ్వాలని, నిధులు ఇవ్వాలని కోరారు. ఇందుకు అనుగుణంగానే మాట్లాడారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో వ్యవసాయరంగ అభివృద్ధికి తీసుకున్న చర్యలను ఈ సమావేశంలో వివరిచారు. ముఖ్యంగా రైతు పెట్టుబడి, రైతుకు బీమా, మార్కెటుకు వచ్చిన ప్రతి ధాన్యపుగింజను కొనడం దగ్గర నుంచి రైతుల పంటపొలాలకు సాగునీళ్లు ఇవ్వడం కోసం ప్రాజెక్టులను నిర్మిస్తున్న తీరును సమావేశంలో వివరించారు.
see also:అన్నదాతల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకున్న పౌరసరఫరాల శాఖ
అలాగే రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నదీ వివరించారు.అంతే కాకుండా అన్నిరంగాలలో అభివృద్ధికి చేపట్టిన చర్యలను ఉదాహరణలతో సహా వివరించి టీమ్‌ఇండియా స్ఫూర్తిని కలిగించారు. ఆ తరువాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఇదే తరహాలో వివరించే ప్రయత్నం చేశారు. ఇలా స్వప్రయోజనాలు కాకుండా యావత్‌దేశం అనుసరించాల్సిన విధానాన్ని సీఎం కేసీఆర్ నీతిఆయోగ్ వేదికగా వెల్లడించడం అందరి ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా అకర్షించింది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారులతో మాట్లాడుతున్న సందర్భంలో తెలంగాణ అభివృద్ధిలో మొదటిస్థానంలో ఉన్నదని, ఆ తరువాత స్థానంలో మధ్యప్రదేశ్ ఉన్నదని అన్నట్టు తెలిసింది.