ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ టీడీపీకి కొన్ని షాక్ లు తగులుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. తన పార్టీ అధికారంలోకి వచ్చినా భయంతో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సైతం తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే తన తండ్రికి అండగా ఉండి, వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగి ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉండిపోయిన సీనియర్లంతా ఇప్పుడు ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ పిలుపుకోసం ఎదురు చూస్తున్నారు.
see also:వైఎస్ జగన్‌కు పోలీసులు సైతం గులామ్..!
ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండ్రు మురళి ప్రస్తుతం రాజకీయంగా ఖాళీగా ఉంటున్నాడు. కొండ్రు మురళి కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. యువకుడు, దళితుడు కావడంతో పాటు నాడు వైఎస్ ఎంకరేజ్‌తో ఆయన రెండోసారి గెలిచాక మంత్రి కూడా అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని రాజం, ఎచ్చెర్ల నియోజకవర్గాల నుంచి పోటీచేసిన ఆయన రెండుసార్లు టీడీపీలో కాకలు తీరిన ప్రతిభాభారతిని ఓడించారు. చాలా తక్కువ టైంలోనే ఆయన బలమైన నేతగా దూసుకుపోయారు. అంతేకాదు కొండ్రు మురళి గత ఎన్నికలనుంచి ఇప్పటివరకూ ఏ పార్టీలోనూ చేరలేదు.. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లోనూ అంతంత మాత్రంగానే పాల్గొంటూ వచ్చాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ నేపథ్యంలో ముందుగా టీడీపీలో చేరతారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన చూపులు వైసీపీ వైపు ఉన్నాయని తెలుస్తోంది. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వైసీపీలో మంచి ప్రాధాన్యం ఇస్తామని చెప్పడంతో పాటు సీటు కూడా ఖరారు చేయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మురళి వచ్చే నెల 8వ తేదీన వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.