వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరాభిమానుల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్రలో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గోదావరి జిల్లాల ప్రజలు వారి సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారికి భరోసాను కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
see also: వచ్చే నెల 8వ తేదీన వైసీపీలోకి మాజీ మంత్రి కొండ్రు మురళి ..!
ఇదిలా ఉండగా, ఇవాళ జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు ప్రజలతోపాటు పోలీసులు సైతం ఆసక్తి చూపారు. అందులో భాగంగానే రాజమహేంద్రవరం డీఎస్పీ జగన్‌తో ఓ సెల్ఫీ దిగారు.