గోదావరి జిల్లాల్లో ప్రాబల్య వర్గాలైన తెలుగుదేశం పార్టీకి దూరమవుతున్నారా..? జనసేన మద్దతు వల్లే గత ఎన్నికల్లో కాపుల ఓట్లను టీడీపీ దక్కించుకో గలిగిందా..? ఇప్పుడు జనసేన దూరమవడంతో కాపులు కూడా టీడీపీని వ్యతిరేకిస్తున్నారా..? కాపులకు రిజర్వేషన్ అన్న హామీని నెరవేర్చకపోవడంతో ఆ సామాజికవర్గ ప్రజల్లో తెలుగుదేశం పై అసంతృప్తి పెరుగుతోందా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
see also:టీడీపీకి ప్రస్తుత మంత్రి గుడ్ బై-తేల్చేసిన బాబు ఆస్థాన మీడియా ..!
ఇక అసలు విషయానికొస్తే.. 2014 ఎన్నికల్లో అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబు అధికారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇక అప్పట్నుంచి నేటి వరకు చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో… ఇప్పటి వరకు ఏ హామీ కూడా అమలుకాకపోవడం గమనార్హం. మరో పక్క ప్రజలకు ఇచ్చిన హామీలతోపాటు.. ఇవ్వని హామీలను కూడా అమలు చేశామని చెప్పుకోవడం చంద్రబాబు సర్కార్ వంతైంది.
see also:వచ్చే నెల 8వ తేదీన వైసీపీలోకి మాజీ మంత్రి కొండ్రు మురళి ..!
అయితే, 2014 ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు ఇచ్చిన హామీల్లో కాపులను రిజర్వేషన్ పెంపు అంశం కూడా ఒకటి. ఆ ఒక్క హామీతోనే, అలాగే, జనసేనతో టీడీపీ జతకట్టడంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రజలు టీడీపీకి పట్టం కట్టారని, ఎక్కువ అసెంబ్లీ సీట్లను కూడా కట్టబెట్టారన్నది రాజకీయ విశ్లేషకుల భావన. అయితే, చంద్రబాబు హామీలూ నీటి మూటల్లానే మిగిలిపోయాయి. కాపులకు రిజర్వేషన్ అంశాన్ని పక్కనపెట్టి.. కాపులను నిండా ముంచారు. అధికారం కోసం ఏమైనా చెబుతానని మరో సారి చంద్రబాబు నిరూపించుకున్నారు.
see also:వైఎస్ జగన్‌కు పోలీసులు సైతం గులామ్..!
మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటి వరకు ఏ జిల్లాల్లో ప్రజా సంకల్ప యాత్రలో కనిపించని జన సందోహం ఉభయ గోదావరి జిల్లాల్లో కనిపించింది. గోదావరి జిల్లాల ప్రజలు జగన్‌పై చూపుతున్న ఆదరణను చూసిన రాజకీయ విశ్లేషకులు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని పేర్కొంటున్నారు.