అమెరికా సెక్స్ రాకెట్లో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో యావత్ టాలీవుడ్ ప్రపంచం లో ప్రకంపనలు రేపుతోంది. ప్రవాసాంధ్రుల కార్యక్రమాల ముసుగులో మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులు నడిపిన సెక్స్ రాకెట్ సినీ ప్రపంచాన్నే తలదించుకునేలా చేసింది. ఈ వ్యవహారానికి బాధ్యుడైన మోదుగుమూడి కిషన్ ద్వారా అమెరికా వీసాలు అందుకున్న వారిలో పలువురు సినీ ప్రముఖులతోపాటు, బుల్లితెర యాంకర్లూ ఉన్నారు. అయితే, వీరిలో ఎంత మందిని కిషన్ మోదుగుమూడి దంపతులు తమ లైంగిక వ్యాపారానికి వాడుకున్నారో అన్న విషయం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
see also:మరోసారి విజయ్ దేవరకొండకు ఫిదా అయిన మంత్రి కేటీఆర్
ఇదిలా ఉండగా, షికాగో సెక్స్‌రాకెట్‌పై తెలుగు బుల్లితెరపై రాణించిన ముద్దుగుమ్మలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి తమ బాధను వెల్లగక్కుతున్నారు. శ్రీరెడ్డి, లాస్య, అనసూయ ఇంకా పలువురు హాట్ యాంకర్లు ఈ ఇష్యూపై స్పందించిన విషయం తెలిసిందే. మోదుగుమూడి కిషన్ దంపతులు ఎంత నీచులో మీడియాతో పంచుకున్నారు. తమకు కూడా కిషన్ నుంచి కాల్స్ వచ్చాయని, కానీ ఆ కాల్స్‌ను దూరం పెట్టేయడమే కాకుండా.. ఇకపై మాకు ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని చెప్పడంతో కిషన్ తమకు ఫోన్ చేయడం మానేశాడని చెప్పారు. అలాగే, శ్రీముఖి స్పందిస్తూ.. కిషన్ కపుల్స్ నుంచి కాల్స్ వచ్చాయని, చీ కొట్టి ఫోన్ పెట్టేసినట్టు చెప్పింది. అయితే, అమెరికా సెక్స్ రాకెట్ గురించి మోదుగుల కిషన్ తమను సంప్రదించారంటూ ఒక్కొక్కరిగా బయటకు వస్తుండటం గమనార్హం.