తెలుగు రాజకీయ చరిత్రలో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తులు ఇద్దరనే చెప్పుకోవాలి. వారిలో ఎన్టీఆర్ హీరోగా వచ్చి లీడర్‌గా ఎదిగితే వైఎస్ఆర్ మాత్రం లీడర్‌గా వచ్చి హీరోగా ఎదిగారు. ఒక ముఖ్యమంత్రిని కోట్లాది మంది ప్రజలు ఆప్తుడిగా భావించిన ఘనత ఎవరికైనా దక్కిందా..? అంటే అది ఒక్క వైఎస్ఆర్‌కే. నిజమైన నాయకులు ఓట్ల నుంచి కాదు.. జనం గుండెల్లోనుంచి పుడతాడని చెప్పడానికి నిలువుటద్దం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. అచ్చ తెలుగు పంచెకట్టు, అసమాన పాలన వాటన్నిటిని మించిన చిరునవ్వు వైఎస్ఆర్‌ను ప్రజల మనిషిని చేశాయి.
see also:నీరు-చెట్టు,హౌజింగ్ స్కీం పథకాల్లో 30000కోట్ల అవినీతి ..!
అటువంటి మహానేతను తూర్పు గోదావరి జిల్లా ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారు. వైఎస్ఆర్‌ను తాము ఎంతగా ఆరాధిస్తున్నామో తెలియజేప్పేందుకు సమాయత్తమయ్యారు. పనిలో పనిగా వైఎస్ఆర్ కోసం ఏకంగా ఒక గుడినే కట్టారు. ఇందుకు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వేదిక అయింది.