అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని,ఇతర సమస్యలు పరిష్కారించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మహాధర్నా చేపట్టారు.మహానేత వైఎస్సార్ హయాంలో ఉరవకొండ పేదలకు పట్టాలు ఇచ్చేందుకు 89 ఎకరాలు కొనుగోలు చేశారని… నేటికి వాటిని పేదలకు పంపిణీ చేయలేదని విమర్శించారు.ఎమ్మెల్యే ధర్నా విరమించేందుకు అధికారులు ప్రయత్నించారు.అధికారుల వివరణపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
see also:సంచలన వాఖ్యలు చేసిన పురందేశ్వరి..!!
దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు ఉరవకొండ తహశీల్దార్, ఎంపీడీవో, హౌసింగ్ సిబ్బంది నిర్బంధించారు.అప్పటికి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.ఈ సందర్భంలో ప్రజలు దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.దీంతో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు వారాలలోపు జాబితా సిద్ధం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
see also:నోర్మూసుకొని వెళ్ళండి ..లేకపోతే తాట తీస్తా ..ఏపీ సీఎం దాదాగిరి ..!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తన పోరాటాలు అగవని ఎమ్మెల్యే విశ్వ అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క ఇల్లు కూడా కట్టించలేని అసమర్థుడని విమర్శించారు. ఆయన కేటాయించిన భూమిని పంపిణీ చేసేందుకు శాసనమండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఉరవకొండలో పయ్యావుల బ్రదర్స్ కుటుంబ పాలన చేస్తున్నారని అన్నారుఈ కార్యక్రమంలో ప్రజలు వైసీపీ నేతలు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.