కంది రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ శాఖ అధికారులతో బీఆర్కే భవన్ లో రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు కనీస మద్దతు ధరల చెల్లింపు, గోదాముల నిర్మాణం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి, మొక్క జొన్న, జొన్నలు వంటి పంటల మద్థతు ధరలను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తోందని చెప్పారు. రైతుల నుంచి 5618 కోట్ల విలువైన వడ్లను కొనుగోలు చేసి , రైతులకు 5618 కోట్లు మొత్తం చెల్లింపులు చేసినట్లు మంత్రి చెప్పారు. కందులను 1427 కోట్లతో కొని, రైతులకు 1420 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. మిగిలిన 7.33 కోట్లు రెండు రోజుల్లో చెల్లించాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు.
see also:అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది..ప్రధాని మోదీ
రాష్ట్రంలో రైతుల నుంచి శనగలు294 కోట్లతో కొనుగోలు చేస్తే 265 కోట్లు చెల్లింపులు జరిగాయని, మిగిలిన౩౦ కోట్లుచెల్లించాల్సి ఉందని అధికారులు మన్నారు.ఈ మిగిలిన మొత్తాన్ని రెండు రోజుల్లో రైతులకు చెల్లించాలని నాఫెడ్, మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న 629 కోట్లతో రైతుల నుంచి కొనుగోలు చేసి , 611 కోట్లు చెల్లింపులు చేశామని తెలిపారు. మిగిలిన 18 కోట్లు రెండు, మూడు రోజుల్లో చెల్లించాలన్నారు. కందులకు 7.33 కోట్లు, శనగలకు 3.37 కోట్లు, మినుములకు 9.91 కోట్లు, జొన్నల కు 6.21 కోట్లు మార్క్ ఫెడ్ నుంచి రావాల్సి ఉండగా మంత్రి హరీష్ రావు మార్క్ ఫెడ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే ఆ మొత్తాన్ని విడుదల చేయాలని ఆదేశించారు. కందులను కేంద్రం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందోని, రాష్ట్రంలో కొన్నకందులను మార్కెట్ లోకి విడుదల చేయాల్సి ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లోను కందులు ఉన్నాయని, అవి మార్కెట్లోకి పూర్తిగా విడుదల చేశాకే ఇతర దేశాల నుంచి కందులు దిగుమతి చేయాల్సి ఉందన్నారు. ఇదే విషయాన్ని వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు.
see also:దశాబ్దాల భూ వివాదాలకు పరిష్కారం….మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం
గోదాముల నిర్మాణం పైన మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. 322 గోదాములు మంజూరయితే 320 గోదాములు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన 2 గోదాముల నిర్మాణానికి స్థల సేకరణ సమస్య ఉందని అధికారులు చెప్పగా, ఆ సమస్యను పరిష్కరించి ,రీ టెండర్లు పిలిచి వెంటనే రెండు గోదాముల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.