వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజల సంకల్ప యాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారు. వారి సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇవాళ జగన్ తన పాదయాత్రను తూర్పు గోదావరి జిల్లా పీ.గన్నవరంలో కొనసాగించారు.
see also:కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు విఫలం..రేపటి నుంచి రాష్ట్రవ్యాప్త బంద్
అయితే, పాదయాత్రలో భాగంగా ముందుకు పోతున్న జగన్‌కు తనకు చంద్రబాబు సర్కార్ పింఛన్ ఇవ్వడం లేదని చెప్పుకునేందుకు ఓ వృద్ధురాలు వచ్చింది. తనకు పింఛన్ తీసుకునే అర్హత ఉన్నా కూడా జన్మభూమి కమిటీల వారు తనకు పింఛన్ ఇవ్వలేదని చెప్పింది. ఆ క్రమంలోనూ ఆ వృద్ధురాలి కుడికాలి చొప్పు ఊడిపోయింది. ఆ ఘటనను గమనించిన వైఎస్ జగన్ ఆ చెప్పు ను కాస్త సరిచేసి ఆ వృద్ధురాలి కాలికి తొడిగారు. ఇలా జగన్ చేసిన పనికి పీ.గన్నవరం ప్రజలు ఫిదా అయ్యారు.