ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం 192వ రోజు తూర్పు గోడావరి జిల్లాలో ముందుకు సాగుతోంది. పాదయాద్ర చేస్తూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు వారి వారి సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారి సమస్యలను వింటూ.. వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
see also:వైఎస్ జగన్ 192వ రోజు పాదయాత్ర..!
ఇదిలా ఉండగా, 2014 సాధారణ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 600 హామీలకు తోడు, బీజేపీ, జనసేనతో జతకట్టి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఇంటికో ఉద్యోగం, రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ ప్రధానమైనవని, ఆ హామీలను అమలు చేస్తారనే టీడీపీనీ గెలిపించామని పలువురు ప్రజలు మీడియా వేదికగా చెప్పిన విషయం తెలిసిందే.
see also:ఏపీలో వైఎస్ జగన్ సీయం కాబోతున్నాడని తెలిసి..జేసి దివాకర్ రెడ్డి రాజకీయలకు గుడ్ బై
అంతేకాకుండా, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడంలో ఉభయగోదావరి జిల్లాలైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కూడా ముఖ్యపాత్ర పోషించాయి. ఆ ప్రాంత ప్రజలు ఏ జిల్లాలో టీడీపీకి ఇవ్వనన్ని ఎమ్మెల్యే సీట్లను టీడీపీకి కట్టబెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోగా, తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలకు గాను సుమారు 15 అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. అయితే, ఇలా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు టీడీపీకి ఎక్కువ సీట్లు కట్టబెట్టడానికి ప్రధానకారణం చంద్రబాబు ఇచ్చిన హామీలే అన్న విషయం జగమెరిగిన సత్యం.
see also:వైసీపీ అధినేత జగన్ కు “జై”కొట్టిన 51.21%శాతం మంది ..!
అయితే, అదంతా గతమని, రానున్న రోజుల్లో టీడీపీ గడ్డుకాలాన్ని ఎదుర్కోనుందని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు చెబుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీలు అమలు చేస్తారేమోనని ఇప్పటి వరకు చూశామని, తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చంద్రబాబు తమను మళ్లీ మోసం చేశాడని ఆ ప్రాంత ప్రజలు బాహాటంగానే టీడీపీపై విమర్శలు చేస్తున్నారు.