2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపొంది అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి టీడీపీ అధికారాన్ని పంచుకుంది. చివరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందని విమర్శలు గుప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి తాము వైదొలుగుతున్నామని టీడీపీ ప్రకటించింది. ఇదే క్రమంలో వైసీపీపై బురదజల్లేందుకు టీడీపీ చేయని ప్రయత్నాలంటూ లేవు. బీజేపీతో వైసీపీ పొత్తుపెట్టుకుందని విమర్శలు చేయడం టీడీపీ నేతల వంతైంది.
see also:ఏపీ ఎన్జీవో నేతపై దాడి..చొక్కా చినిగి..స్వల్ప గాయాలు
ఈ నేపథ్యంలో ఓ సామాన్యుడు ఇటీవల ఓ మీడియా ఛానెల్ డిబేట్‌లో పాల్గొని మాట్లాడుతూ.. పచ్చబ్యాచ్ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై విరుచుకుపడ్డాడు.
see also;వైఎస్ జగన్ 192వ రోజు పాదయాత్ర..!
1) అమరావతి శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీని ఆ హ్వానించింది ఎవరు..?
2) ఆంధ్రప్రదేశ్ లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయి ఉందని తెలిసి కూడా.. రాజధాని శంకుస్థాపనకు రూ.400 కోట్లు ఖర్చు పెట్టింది ఎవరు..?
3) ప్రధాని నరేంద్ర మోడీకి అమరావతి శంకుస్థాపన సందర్భంగా మట్టి, నీరు తీసుకు రమ్మని చెప్పింది ఎవరు..?
4) ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా..? అని మీడియాను ప్రశ్నించింది ఎవరు..?
5) ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలకు పోలికలు చెబుతూ.. కోడలు మగ బిడ్డను కంటానంటే.. అత్త వద్దంటాదా..? అని ప్రత్యేక హోదా వద్దంటూ చెప్పింది ఎవరు..?
6) ప్రత్యేక హోదాకంటే.. ప్రత్యేక ప్యాకేజీయే మిన్నా అని నినదించింది ఎవరు..?
7) కేంద్ర ప్రభుత్వంలో నాలుగేళ్లపాటు మంత్రి పదవులు అనుభించిన వారు ఏ పార్టీకి చెందినవారు..?
8) దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే.. ఏపీకే ఎక్కువ నిధులు వచ్చాయని చెప్పింది ఎవరు..?
9) నోట్ల రద్దు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురి చేసిన బీజేపీపై పొగడ్తల వర్షం కురిపించింది ఎవరు..?
10) 29 సార్లు ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసింది ఎవరు..?
see also:2019లో జగనే సీఎం..!
ఇదిలా ఉండగా, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని, అందులో భాగంగానే బీజేపీతో పొత్తు పెట్టుకుందంటూ వైసీపీ బురదజల్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరంటూ ఆ వ్యక్తి మీడియా ముఖంగా చెప్పారు.