తెలుగు దేశం ప్రభుత్వ పాలనలో రోజు రోజుకు మహిళల పై వేధింపులు ఎక్కువ అయ్యాయని వైసీపీ రాష్ట్ర మహిళావిభాగం ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని శైలజ చరణ్ రెడ్డి అన్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదికలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల్లో ఐదుగురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ దందా నడిపేవారికి టీడీపీ పెద్ద నాయకులు అండదండలు ఇస్తే చంద్రబాబు మద్దతు తెలిపారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో మగాళ్లు మృగాళ్లుగా మారి మహిళలపై విద్యార్ధినిలపై, పసిపిల్లలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ”ఆయన వచ్చాడు.. మహిళలకు రక్షణ లేకుండా పోయింది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.
see also:పొలిటికల్ సూపర్ స్టార్ వైఎస్ జగన్..! ఎలానో తెలుసా..??
చంద్రబాబు హయాంలో రోజుకొకటి చొప్పున మహిళలపై దారుణ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని దుయ్యబట్టారు. మహిళలకు రక్షణ కల్పించాలంటే 40 సంవత్సరాల అనుభవం అవసరం లేదని మహిళల క్షేమం గురించి ఆలోచించే మంచి మనసు మరియు తపన ఉంటే చాలని, అది ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్ కి మాత్రం ఉందని అన్నారు. జగన్ సీఎం అయితేనే మహిళలు మాన, ప్రాణాలతో, సుఖసంతోషాలతో ఉండగలరని ఆమె జ్యోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జగన్ కి ఒక్క అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేయవలసినదిగా ఆమె కోరుకున్నారు.