ఎప్పుడూ ఏదోక సంచలనాలు మాట్లాడే తెలుగుదేశం మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి మరోమారు హాట్ టాపిగ్ గా మారారు. అది ఏమిటంటే జేసి రాజకీయలకు గుడ్ బై చెప్పనున్నట్లు బాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏపీ లో అనంతపురం జిల్లా జేసి ఫ్యామిలీకి కంచుకోట అంటారు.. తాడిపత్రి..నియోజక వర్గం అనంతపురంలో తమకు తిరుగులేదు అంటారు జేసి బ్రదర్స్ పార్టీలో ఉండి తెలుగుదేశం పై కూడా కామెంట్లు చేయడం వారికే సాధ్యం.. ఆసాహసం చేసేది కేవలం జేసి బ్రదర్స్ అనేది అందరికి తెలిసిందే.. అన్న అనంతపురం ఎంపీగా, తమ్ముడు తాడిపత్రి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.. ఇక గతంలో తాను రాజీనామా చేసి, తెలుగుదేశాన్ని పరుగులు పెట్టించారు జేసి దివాకర్ రెడ్డి.. అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయను అని, ఇప్పటికే ఎంపీ జేసి దివాకర్ రెడ్డి అన్న సంగతి తెలిసిందే..దీనికి కారణం ఒకటి బాగా ప్రచారం సాగుతుంది. ఏందుకంటే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ 2019 ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు చాల మార్లు అన్నారు. ఏంటి ఇంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు..? అని అనుకుంటున్నారా..!!
see also:వైసీపీ అధినేత జగన్ కు “జై”కొట్టిన 51.21%శాతం మంది ..!
మీ సందేహాలకు సాక్షాధారాలు ఇదిగో 2014 లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పట్నుంచి చంద్రబాబు సర్కార్ పనితీరును, అలాగే రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే మీరూ అవుననే అంటారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు సర్కార్ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన మాట జగమెరిగిన సత్యం. రుణాల మాఫీ, ప్రతీ ఇంటికో ఉద్యోగం, అలాగే, కేంద్రం బాధ్యతను (పోలవరం ప్రాజెక్టు నిర్మాణం) తమ నెత్తినేసుకుని పైసలు అందిన కాడికి దండుకోవడం, అలాగే, మహిళలపై టీడీపీ నేతల నుంచి సామాన్య కార్యకర్త వరకు అరాచకాలు, కాల్ మనీ, సెక్స్‌రాకెట్, ప్రభుత్వ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యేల దాడులు. రాజధాని నిర్మాణం కోసమంటూ సామాన్య ప్రజల నుంచి భూములు లాక్కోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు సర్కార్ వైఫల్యాలు కో కొల్లలు. ఇక తెలుగు తమ్ముళ్ల ఆటలు చూడలేక.. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసా ఇవ్వడానికి జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రతి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.ఖచ్చితంగా వైఎస్ జగన్ యుఖ్యమంత్రి అవుతాడని ప్రతి సర్వేలు చెప్పాయి..దీంతో ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని తెలిసి.. అనంతపురం మాజీ ఏంపీ జేసి దివాకర్ రెడ్డి రాజకీయలకు గుడ్ బై చెబుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్నది.