తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థ లో ఇప్పటికే ఎన్నో మార్పులను తీసుకు వచ్చింది.తాజాగా రాష్ట్రంలోని డిగ్రీ విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది .భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత సబ్జెక్టులతో పాటు.. భవిష్యత్తులో ఉపయోగపడే IAS, IPS లాంటి పరీక్షల కోసం కోచింగ్ లు ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే నూతన విద్యావిధానానికి రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టింది .
see also:ఆదర్శంగా నిలిచిన కార్పొరేటర్ రంజిత్ రావు..!!
ప్రభుత్వ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకు చదువుతోపాటు ఉద్యోగ అర్హత పరీక్షలకు శిక్షణ ఇప్పించనున్నది.జాతీయ స్థాయిలో నిర్వహించే IAS,IPS లాంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగ రాతపరీక్షలతోపాటు MBBS, IIT, NITలలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్, IIT-JEE వంటి ప్రవేశపరీక్షలపై గ్రామీణ, పేద విద్యార్థులకు పాఠశాల దశనుంచే అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు.
see also:షాది ముబారక్ ద్వారా రూ.1,00,116 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణే
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సివిల్స్ కు సిద్ధమవుతున్న ఎంతో మంది విద్యార్థులు లక్షల రూపాయలు చెల్లించి IAS కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు అంత స్తోమత లేకపోవడంతో వారికి కూడా ఈ అవకాశాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది .దీనిని 2019 విద్యా సంవత్సరం నుంచి అమలుచేయాలని విద్యాశాఖ శాఖ నిర్ణయించింది.