తెలుగు తెరపై అద్దిరిపోయే జోడీ అంటే టక్కున చెప్పే పేర్లు ప్రభాస్, అనుష్క. తెరపై వారి కెమిస్ట్రీ, బయట వారిద్దరి మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న చనువు కారణంగా వీరిపై అనేక రూమర్స్ ఇప్పటికే చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్లను వారిద్దరూ ఖండించడంతో కొన్నాళ్లు ప్రశాంతంగానే ఉంది. మళ్లీ ఈ మధ్య ఆ ప్రచారం ఊపందుకుంది. రెండు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ప్రభాస్, అనుష్కలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తలనూ నిజం లేదని తేలింది.
see also:చికాగో సెక్స్ రాకెట్-అమెరికా నెంబర్ తో నన్ను సంప్రదించారు-అనసూయ .!
తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ పెద్దలు కుదర్చిన వివాహాన్నే చేసుకుంటున్నాడని తెలిసింది. ప్రభాస్ తల్లి శివకుమారి, పెదనాన్న కృష్ణంరాజు ఒక అమ్మాయిని అనుకున్నారట. భీమవరంలో విద్యా సంస్థలు నడుపుతున్న ఒక ప్రముఖ వ్యక్తి కుమార్తెను ప్రభాస్‌కు అడుగుతున్నారని సమాచారం. ఇప్పటికే రెండు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయని, ప్రస్తుతం మాటల్లో ఉన్న ఈ సంబంధం ఖరారైతే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.