Home / SLIDER / కాంగ్రెస్‌లో క‌ల్లోలం..నేత‌ల చేరిక‌ల‌తో కొత్త వివాదం

కాంగ్రెస్‌లో క‌ల్లోలం..నేత‌ల చేరిక‌ల‌తో కొత్త వివాదం

తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే ప‌డుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు అంటూ ఆ పార్టీ నేత‌లు ఎత్తుగ‌డ‌లు కాస్త సెల్ఫ్‌గోల్ అవుతున్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కొన‌గాల మ‌హేష్ పార్టీ మీడియా క‌మిటీ క‌న్వీన‌ర్‌, అధికార ప్ర‌తినిధి హోదాలో ఉండ‌గా…ఆయ‌న‌ విష‌యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  క్రమశిక్షణ చర్యలు తీసుకోవ‌డం ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారుతోంది.

see also:వికలాంగుల సంక్షేమం కోసం కేంద్ర‌మంత్రికి ఎంపీ క‌విత కీల‌క డిమాండ్‌

బీజేపీకి చెందిన ఆది శ్రీ‌నివాస్‌ హ‌స్తం కండువా క‌ప్పుకోవ‌డం కీల‌క నియోజ‌క‌వ‌ర్గ‌మైన వేములవాడ‌లో విబేధాలు పొడ‌చూపేందుకు కార‌ణంగా  మారింది. ఆది చేరిక‌తో వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రెండు గ్రూపులుగా చీలిపోయారు. ఆది చేరికను వ్యతిరేకిస్తూ వస్తున్న ఏఐసీసీ సభ్యుడు కొనగాల మహేష్‌, టీపీసీసీ సభ్యుడు ఏనుగు మనోహర్‌రెడ్డి ప్రత్యేకంగా గ్రూపుకట్టారు. ఆది శ్రీను చేరిక కార్యక్రమాన్ని బహిష్కరించారు. తమ అనుయాయులతో కోరుట్లలో క్యాంపు రాజకీయం మొదలెట్టారు. మాజీ ఎంపీ టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ఆధ్వర్యంలో సుమారు 1500మంది అనుచరులతో “మళ్లీ“ కాంగ్రెస్‌లో చేరారు.

see also:ప్ర‌ధానికి సీఎం కేసీఆర్‌ పది విన‌తి ప‌త్రాలు..అందులో ఏముందంటే..!!

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తమకు సమాచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కొనగాల మహేష్‌, మనోహర్‌రెడ్డిలతో పాటు నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని బహిష్కరించారు. పొన్నం తీరును నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. వేములవాడలో ర్యాలీ చేపట్టారు దీంతో కాంగ్రెస్ ఆయ‌న‌పై వేటు వేసింది. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..త‌న‌పై కొంద‌రు కుట్ర చేస్తున్నార‌ని ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే సీఎం సీట్‌ కోసం వివాదం కొన‌సాగుతుండ‌గా…ఇప్పుడు నాయ‌కుల చేరిక‌తో ఎమ్మెల్యే సీట్ల కోసం అదే ర‌చ్చ తెర‌మీద‌కు వ‌చ్చిందంటున్నారు. నాయ‌కుల చేరిక బ‌లం అనుకుంటే అదే బ‌ల‌హీన‌త‌గా మారిందంటున్నారు.

see also;ప్రధాన మోదీతో సీఎం కేసీఆర్ భేటీ ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat