అన్నదాతల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం పలు రాష్ర్టాల చూపు తెలంగాణ వైపు తిప్పుకొన్న సంగతి తెలిసిందే. ఏకంగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర రైతులు తమకు ఇలాంటి పథకమే కావాలని డిమాండ్ చేశారు. అందుకోసం తమను తెలంగాణలో కలపాలని కోరారు. ఇదిలాఉంటే…తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయిన సందర్భంగా ఈ పథకంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం .
see also:ప్రధానికి సీఎం కేసీఆర్ పది వినతి పత్రాలు..అందులో ఏముందంటే..!!
ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం చేసిన నూతన జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సీఎం కేసీఆర్ సిఫారసు కోరాను. మైనారిటీ, గిరిజన రిజర్వేషన్లు వంటి అంశాలను రాష్ట్రాలకే పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ఎయిమ్స్ కి నిధులు వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతుబందు పథకం గురించి ప్రధాని మోడీ ప్రత్యేకతంగా సీఎం కేసీఆర్‌ను అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఈ పథకం గురించి సీఎం కేసీఆర్ వివరించారని తెలుస్తోంది.