తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ఒకవైపు సంతోషం.. మరోవైపు అనుమానాలు.. ఆరు దశాబ్దాల పోరు సాకారమైంది. ఎలా పాలించుకుంటాం? ‘తెలంగాణ వద్దు’ అన్న వారి ముందు పలుచన అవుతామా? తలెత్తుకుని నిలిచే విధంగా మన రాష్ట్రాన్ని మనం పాలించుకుంటామా? .. ఇలా తెలంగాణ వాదుల మదిలో సందేహాలు ఎన్నో. ఉద్యమకారులుగా విజయం సాధించిన వారు ఎందరో వ్యక్తులు పాలకులుగా ఆ స్థాయిలో విజయం సాధించలేదు. ‘కాలం కలిసొచ్చింది, దేవుడు కరుణించాడు’- అన్నట్టు బాలారిష్టాలను అధిగమించి దేశానికి దారి చూపే విధంగా తెలంగాణ ప్రగతి పథాన పరుగులు తీస్తోంది. రాజకీయ విమర్శలు, ఎత్తులు- పైఎత్తులు , విజయాలు పక్కన పెట్టి తెలంగాణ కోణంలో ఈ ప్రాంతవాసులకు ఈ నాలుగేళ్లలో మేలు జరిగిందా? లేదా? అని చూస్తే, సాధారణ ప్రజలు ఊహించిన దాని కన్నా ఎక్కువే మేలు జరిగింది.
see also:వికలాంగుల సంక్షేమం కోసం కేంద్రమంత్రికి ఎంపీ కవిత కీలక డిమాండ్
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే…ఉమ్మడి రాష్ట్రంలో ‘క్రాప్ హాలిడే’ అనే మాట తరుచుగా వినిపించేది. అనావృష్టి, ఎరువులు దొరక్క పోవడం, విద్యుత్ కోత వంటి సమస్యలతో పంటలకు విరామం ఇవ్వడం అప్పట్లో ఒక సంప్రదాయంగా మారింది. చాలా చోట్ల పంటలు వేయకుండా ‘క్రాప్ హాలిడే’ అంటూ రైతులు ఆందోళన చేసేవారు. తెలంగాణలో ఈ నాలుగేళ్ల తెరాస పాలన చూస్తే ప్రత్యర్థులకు ‘రాజకీయ విరామం’ ప్రకటించినట్టుగా ఉంది. కేసీఆర్ సీఎం పీఠాన్ని అధిష్ఠించాక నాలుగేళ్లలో సాధించిన ప్రగతి, ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అధికార తెరాస పార్టీకి పెద్దగా పోటీ కనిపించడం లేదు.
see also:కాంగ్రెస్‌లో కల్లోలం..నేతల చేరికలతో కొత్త వివాదం
కాగా, మహారాష్టల్రోని నాంధేడ్ ప్రాంతానికి చెందిన 40 గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలిపివేయాలని తీర్మానం చేశారు. తెలంగాణకు ఆనుకుని ఉన్న ఈ గ్రామాల ప్రజల డిమాండ్‌కు అక్కడి నాయకులు సైతం మద్దతు పలికారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి తీర్మానాల గురించి విన్నామా? కన్నామా? తెలుగు ప్రజలు ఎక్కువగా ఉంటూ ఒడిశాలో కలిసిపోయిన బరంపురం వంటి కొన్ని ప్రాంతాలను తిరిగి ఆంధ్రలో కలిపేయాలని ఉమ్మడి రాష్ట్రంలో కొన్నిసార్లు డిమాండ్లు వినిపించాయి. తెలుగు వారు ఎక్కువగా ఉన్నందున భాష ప్రాతిపదికగా ఆ ప్రాంతాలను ఏపీలో కలపాలనే డిమాండ్లు వినిపించాయి. కానీ, అభివృద్ధి పథకాల అమలు తీరును చూసి, తమ గ్రామాలను తెలంగాణలో కలిపేయాలని వారు కోరడాన్ని చూస్తే కేసీఆర్ సర్కారు ఏం సాధించిందో అన్నది అర్థమవుతుంది. ఆ గ్రామాలవారు తెలుగు వారేమీ కాదు. వారి మాతృభాష మరాఠీ. తెలంగాణలో కలవాలని ఎందుకు అనుకుంటున్నారు? అని మీడియా ప్రశ్నిస్తే- నిరంతర విద్యుత్, రైతుబంధు పథకం కింద లభిస్తున్న పెట్టుబడి సహాయం గురించి ఆ రైతులు వివరించారు. అది రైతు సంక్షేమ సర్కారు పనితీరు అని వివరిస్తున్నారు.