ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశం ముగిసింది. ఈ ఇద్దరి మధ్య దాదాపు 50 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ర్టానికి సంబంధించిన పది అంశాలపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖలు ఇచ్చారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని సీఎం కోరారు.
see also:వికలాంగుల సంక్షేమం కోసం కేంద్రమంత్రికి ఎంపీ కవిత కీలక డిమాండ్
కొత్త జోనల్ వ్యవస్థ, రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపాలని, రాష్ట్రంలో జవహర్ నవోదయ విద్యాలయాల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు వంటి అంశాలపై ప్రధానికి కేసీఆర్ వినతిపత్రం ఇచ్చారు.తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ నిధులు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచడం, సెక్రటేరియట్ నిర్మాణానికి రక్షణ శాఖ స్థలాల కేటాయింపు గురించి కోరారు.
see also:కాంగ్రెస్‌లో కల్లోలం..నేతల చేరికలతో కొత్త వివాదం
అంతే కాకుండా వెనుక బడిన జిల్లాల అభివృద్ధి నిధుల విడుదల, ఐఐఎం మంజూరు, ఐటిఐఆర్ కు నిధులు, కరీంనగర్ లో ఐఐఐటి ఏర్పాటు, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు, కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తదితర అంశాలపై ప్రధాన మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై ప్రధాన మంత్రి సానుకూలంగా స్పందించారు.
see also;ప్రధానికి సీఎం కేసీఆర్ పది వినతి పత్రాలు..అందులో ఏముందంటే..!!