తెలుగు నిర్మాత సెక్స్ రాకెట్ వ్యవహారం అమెరికాలో భయట పడింది. అమెరికాలో అవకాశాల కోసం అందమైన యువతులను ఎరవేసి, వ్యభిచారం చేస్తూ అడ్డంగా చికాగో పోలీసులకు దొరికి పోయి కటకటాలపాలైన నిర్మాత కుటుంబ వ్యవహరం ఇటివల వెలుగులోకి వచ్చింది. ప్రవాసాంధ్రులు అమెరికాలో వివిధ రాష్ట్రాలలో పలు సంఘాల పేరిట నిర్వహించే ఈవెంట్ల నిర్వహణ కోసం ఇండియా నుంచి అందమైన అమ్మాయిలకు విజిటింగ్ వీసాల పేరుతో రప్పించుకొని, వారికి మాయ మాటలు చెప్పి డాలర్లు సంపాదించుకోవచ్చునని చెప్పి ఆధునిక వ్యభిచారంలోకి దింపి, డబ్బులు సంపాధించుకోవడం అలవాటుగా మార్చుకొన్నారు ఈ నిర్మాత. రాజు ఇప్పుడు అమెరికాలోని చికాగాలో స్థిరపడ్డారు. అక్కడ ప్రసాంధ్రులు తరచుగా తెలుగువారి కోసం పలు ఈవెంట్లు నిర్వహిస్తుంటారు.
see also:విడుదలకు సిద్ధమైన అడవిశేష్ “గూడాచారి”
ఈ కార్యక్రమాల కోసం టాలీవుడ్లోని కొంతమంది యువ హీరోయిన్లు, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న అమ్మాయిలను వారి బలహీనతలు తెలుసుకొని వారికి ఉద్యోగాలు, ఇతర అవకాశాల పేరుతో మాయ మాటలు చెప్పి బలవంతపు అంగీకారలతో వ్యభిచారంలోకి దింపడంలో రాజు అతని భార్య సిద్ధహస్తులయ్యారు. రాజు భార్య అప్పటికే తమకు అందుబాటులో ఉన్న విటులతో బేరసారాలు జరిపి సజావుగా కార్యక్రమాలు చక్కదిద్దేది.రాజు దంపతులకు ఈ కార్యక్రమాల ద్వారా మంచి ఆదాయం వస్తుండడంతో చాలా మంది యువతులు ఆకర్షితులయ్యారు.పలువురు మోసపోయారు. ఇలా మోసపోయిన వారిలో టాప్ హీరోయిన్లలో ఒకరు కూడ ఉన్నారని ..అది చాలా గోప్యంగా ఉంచరాని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చికాగో పోలీసులు వారి పేర్లను కూడ త్వరలో వెల్లడిస్తారని తెలుస్తుంది.