రైతుబంధు పథకంతో రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసికుంటున్నరు . గతంలో ఉద్దెరకు ఖాతా పెట్టి వ్యాపారుల దగ్గర తీసుకునేటప్పుడు వాళ్ళు నాసిరకం విత్తనాలు ఇవ్వడం రైతులు నష్టపోవడం జరిగేది . ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని రైతుబంధు చెక్కులు నడుచుకుంటూ ఇంటికే రావడంతో చేతిలో డబ్బులు ఉన్న రైతన్నలు ముందే విచారించుకొని విత్తనాల షాపుకు పోయి మంచి కంపెనీ విత్తనాలు కావాలని అడిగి మరీ తీసుకుంటున్నరు .
see also:నల్లగొండలో మరో దారుణ హత్య
ఈ విషయాన్ని ఒక పత్తి విత్తనాల కంపెనీ డీలర్ చెప్పి చాలా సంతోషాన్ని వెలిబుచ్చిండు . కొన్నెండ్లు రీసెర్చ్ చేసి ఎక్కువ దిగుబడి ఇచ్చే విత్తనాలను తయారు చేసిన కంపెనీల వాళ్ళు తమకు రైతుబంధు కారణంగా రైతుల నుండి ఎక్కువ ఆదరణ లభిస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నరు . దీనివల్ల రైతులకు ఈ ఖరీఫ్ లో దిగుబడి కూడా ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నరు . గత నాలుగేళ్లుగా మిషన్ కాకతీయలో కొన్ని కోట్ల ట్రాక్టర్ల చెరువు మట్టి పోయించుకోవడంతో అప్పుడు దిగుబడి బాగానే వచ్చింది . ఇప్పుడు తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుండి ఉద్భవించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న రైతుబంధు కారణంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుతుండడంతో ఆ ప్రభావం ఖరీఫ్ దిగుబడుల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తున్నది .