రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా కేంద్రంలో మరో దారుణ హత్యా జరిగింది . నల్లగొండ మున్సిపల్ ఛైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త శ్రీనివాస్ దారుణ హత్య మరువక ముందే మరో దారుణం జరిగింది.అలుగుల పెద్ద వెంకట్‌రెడ్డి అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా పొడిచి చంపి వెళ్ళిపోయారు.ఈ ఘటన జిల్లాలోని అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది.అయితే ఈ ఘటనకు భూ తగాదాలే ఇందుకు కారణంగా సమాచారం. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.