తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురు చెప్పింది.ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖలో పోస్టులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా వైద్యారోగ్యశాఖకు సంబంధించి 2 వేల 378 పోస్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఉపింది . రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలీజీలకు ఈ పోస్టులను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి దవాఖానల్లో ఒక్కోదానికి వేర్వేరుగా 952 రెగ్యులర్ పోస్టులు, 237 తాత్కాలిక పోస్టుల చొప్పున మంజూరు చేశారు. రెండు కళాశాలలు, దవాఖానల్లో మొత్తం కలిపి 2 వేల 378 పోస్టులను భర్తీ చేస్తారు.