వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ప్రజా సంకల్ప యాత్ర నేటికి 188 రోజులకు చేరుకుంది. ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకుని, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది.
see also:వైఎస్ జగన్‌పై.. సినీ నటుడు విజయ్‌చందర్ సంచలన వ్యాఖ్యలు..!
ఇదిలా ఉండగా, మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రజా సంకల్ప యాత్ర ఎంటరవుతున్న నేపథ్యంలో మత్స్యకారులు వారిదైన శైలిలో జగన్‌కు స్వాగతం పలికారు. సుమారు 300 పడవలతో జగన్‌కు స్వాగతం పలికారు. జై జగన్… జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలను పట్టుకుని రాజమహేంద్రవరం బ్రిడ్జీ కింద, గోదావరి నదిలో ప్రయాణిస్తూ జగన్‌కు స్వాగతం పలికారు.