వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ముగించుకొని తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రిలోకి అశేష జనవాహిని మధ్య విజయవంతంగా ప్రవేశించింది.ఈ సందర్భంగా తూర్పుగోదావరిలోకి ప్రవేశించే సమయంలో గోదావరి వంతెన రోడ్ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రంతో ఊగిపోయింది.జగన్ కు తూర్పు గోదావరి జిల్లా నాయకులూ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
see also;300 పడవలతో జగన్‌కు మత్స్యకారులు..!
జగన్ పాదయాత్ర సందర్భంగా రోడ్ కం రైల్వే బ్రిడ్జిని వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో అందంగా ముస్తాబు చేశారు.బ్రిడ్జి కింద గోదావరిలో ఒక వైపున పార్టీ జెండాలతో అలంకరించిన 600 పడవలు జగన్‌కు స్వాగతం పలికాయి.అలాగే బ్రిడ్జికి మరోవైపున రెయిలింగ్‌కు 7 అడుగుల ఎత్తు, 3.5 కిలోమీటర్ల మేర భారీ పార్టీ జెండాను కట్టి జగన్ మోహన్ రెడ్డికి సాధారంగా స్వాగతం పలికారు. అంతేకాకుండా జెండాలోని మూడు రంగుల చీరలతో 150 మంది మహిళలు 150 గుమ్మడికాయలతో హారతి ఇచ్చారు.
see also:వైఎస్ జగన్‌పై.. సినీ నటుడు విజయ్‌చందర్ సంచలన వ్యాఖ్యలు..!
అయితే సుమారు 4.5 కిలోమీటర్లున్న రోడ్ కం రైల్వే బ్రిడ్జి పూర్తిగా కార్యకర్తలు, వైఎస్ జగన్ అభిమానులతో జనసంధ్రమైంది . తూర్పు గోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల నుంచి నాయకులూ,కార్యకర్తలు,ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా వేలాదిమంది బ్రిడ్జి మీదకు చేరుకోవటంతో బ్రిడ్జి కొంచెం కదిలింది .వేలాది మంది కార్యకర్తలు,ప్రజలు జగన్ తో అడుగులో అడుగు వేస్తుండగా బ్రిడ్జి కొంచెం ఉగుతూ..జగన్ మోహన్ రెడ్డి కి ఘనస్వాగతం పలికింది .అయితే ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది ఆ వీడియో మీకోసం..