వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితమే జగన్ పాదయాత్ర రాజమహేంద్రం వద్దగల లు కమ్ రోడ్డు వంతెనపై నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. అయితే, జగన్ కోసం ఎదురు చూస్తున్న తూర్పు గోదావరి జిల్లా ప్రజలు .. జగన్‌కు బ్రహ్మరథం పట్టారు.
మరో పక్క జగన్ ఏ గ్రామానికి వెళ్లినా ఘన స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ జగన్ కోసం చేస్తున్న పలు ఆసక్తికర విషయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రజలు ఎదురు చూస్తున్నారు. వర్షం ఆయనకు స్వాగతం పలికింది. అంతేకాకుండా, తండోప తండాలుగా ప్రజలు పాల్గొని జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. జగన్ కోసం ఊళ్లు ఊళ్లన్నీ తరలి వచ్చాయి. జగన్ అన్నకు తోడుగా ఉంటామని వారంతా నినాదాలు చేస్తున్నారు అంటూ ఆ మహిళ తన సోషల్ మీడియా పోస్టులో చెప్పుకొచ్చింది. అందులో భాగంగా జగనన్నకు ఒక చెల్లెమ్మగా స్వాగత పలికేందుకు తనవంతుగా పూలుకోసి పెట్టినట్టు చెప్పింది.