వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ ప్రారంభించిన పాదయాత్ర కాసేపటి క్రితమే పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైలు కమ్ రోడ్ వంతెనకు చేరుకుంది. అక్కడ్నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రతో తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు.
see also;చంద్రబాబు సర్కార్‌కు.. వైఎస్ జగన్ ఊహించని ట్విస్ట్..!
అయితే, వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజలకు అభివాదం చేస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు కొనసాగుతుంటే.. చివర్లో జగన్ కటౌట్‌తో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు కదిలారు. సుమారు 30 అడుగుల ఎత్తులో ఉన్న జగన్ కటౌట్ మీడియాను ఆకర్షించింది. జగన్ కటౌట్ కనపడగానే కెమెరాలన్నీ అటువైపుగా కదిలాయి.