Home / MOVIES / యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ `పంతం` షూటింగ్ పూర్తి.. జూలై 5న గ్రాండ్ రిలీజ్‌

యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ `పంతం` షూటింగ్ పూర్తి.. జూలై 5న గ్రాండ్ రిలీజ్‌

టాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా కె.చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.,రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ 25వ చిత్ర‌మిది. సినిమాకు సంబంధించిన కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలు, పాట‌ల‌ను చిత్రీక‌ర‌ణ కోసం యూనిట్ యు.కెకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది.

see also:త్వరలోనే ‘అభిమన్యుడు 2’ – మాస్‌ హీరో విశాల్‌

రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కి ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఒక వైపు క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటూనేమంచి మెసేజ్‌తో సినిమాను రూపొంద‌స్తున్నామ‌ని చిత్ర యూనిట్ వెల్ల‌డించిన‌ట్లే.. సినిమా ఎలా ఉంటుందో టీజ‌ర్‌లో శాంపిల్ చూపించారు. ఓటును ఐదువేల‌కు అమ్ముకుని అవినీతి లేని స‌మాజం కావాలి.. క‌రెప్ష‌న్ లేని కంట్రీ కావాలంటే ఎక్క‌డి నుండి వ‌స్తాయి అని హీరో కోర్టులో వేసే ప్ర‌శ్న‌.. అంద‌రినీ ఆలోచింప‌చేసేదిగా, ఎమోష‌న‌ల్‌గా ఉంది.

see also:మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ చేతుల మీదుగా `జంబ‌ల‌కిడి పంబ‌` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌

ఓ వైపు మంచి మెసేజ్‌తో పాటు సినిమాలో ప్రేమ‌, వినోదం వంటి అంశాలు పుష్క‌లంగా ఉండ‌బోతున్న‌ట్లు ట‌జ‌ర్‌తో శాంపిల్ చూపించారు. దీంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. గోపీచంద్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌న‌ప‌డ‌ని క్యారెక్ట‌ర్‌లో సంద‌డి చేయ‌బోతున్నారు.

see also:నాని లీగ‌ల్ నోటీసుల‌పై స్పందించిన శ్రీ‌రెడ్డి..!

యు.కె. షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో టాకీపార్ట్‌, పాట‌లు పూర్త‌య్యాయి. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూలై 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత కె.కె.రాధామోహ‌న్ స‌న్నాహాలు చేస్తున్నారు.

see also:బ్రేకింగ్ : శ్రీరెడ్డి కి షాక్ ఇచ్చిన నాని..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat