కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ లో భాగంగా ధర్మారం మండలం మేడారం గ్రామంలోని ప్యాకేజి -6 టన్నెల్ లోని సర్జ్ పూల్ పనులను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సర్జ్ పూల్ వద్ద అమర్చిన ఏడు గేట్ల అమరిక పనులను పరిశీలించిన అనంతరం రెండు పంపులను జులై చివరి నాటికి పూర్తిస్థాయిలో వినియోగం లోకి తేవాలన్నారు. ఒక్కో పంప్ ద్వారా రోజుకు 0.27 టీఎంసీ నీటిని పంప్ చేయవచ్చని, దాదాపు 0.54 టీఎంసీని రెండు గేట్ల ద్వారా పంప్ చేయవచ్చని మంత్రి చెప్పారు. విద్యుత్ సరఫరా చేసి డ్రైరన్ నిర్వహించాలని ఆదేశించారు. గ్యాస్ ఇన్సులేషన్ విద్యుత్ ఉప కేంద్రాన్ని జూన్ చివరి నాటికి పూర్తిచేయాలని సీమన్స్ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.
see also:చలాకీ చంటికి తప్పిన ప్రమాదం
టన్నెల్ పనులు దాదాపు పూర్తయయ్యాని , టన్నెల్ కూడళ్ల వద్ద పని కొంత మిగిలి ఉందని ప్రాజెక్టు ఇంజనీర్లు మంత్రికి చెప్పగా, ఆ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్యాకేజీ -6 హెడ్ రెగ్యులేటర్ గేట్లను పూర్తి స్థాయిలో వినియోగం లోకి తెచ్చేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. టన్నెల్ గుండే వెళ్లే నీటిలోని చెత్తను సేకరించే ట్రాష్ ర్యాక్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పారు.