వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చి మగోదావరి జిల్లాల్లో పూర్తి చేసుకుని కొద్ది సేపటి క్రితమే తూర్పు గోదావరి జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. జగన్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పాదయాత్ర ద్వారా తమ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ప్రజలు జగన్‌పై పూల వర్షం కురిపించారు.
see also:ప్రజాసంకల్ప యాత్ర – రాజమండ్రి బ్రిడ్జీపై ఎవరూ చూడని దృశ్యం..!
ఇదిలా ఉండగా, తూర్పు గోదావరి జిల్లా అధికార పార్టీ టీడీపీ శ్రేణులకు వైఎస్ జగన్ ఊహించని షాక్ ఇచ్చాడు. అయితే, జగన్ ఇప్పటి వరకు ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకున్న ప్రాంతాల్లో పలు చోట్ల త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేయించేందుకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు అదే ఫార్ములాను తూర్పు గోదావరి జిల్లాలోనూ వైఎస్ జగన్ పాటించనున్నారు.
see also:వైఎస్ జగన్ కోసం.. ఈ మహిళ ఏం చేసిందో తెలుసా..?
అయితే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో 19 అసెంబ్లీ స్థానాలు ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ కేవలం ఐదు స్థానాల్లో గెలుపొందింది. అందులోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు చంద్రబాబు చూపిన డబ్బు మూటలకు అమ్ముడు పోగా.. మిగిలిన ఇద్దరు ప్రజలు నమ్మిన జగన్ వెంట ఉన్నారు. అసలే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు సర్కార్ పాలనపై వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో.. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా ప్రభావం చూపనుంది. చంద్రబాబు పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మరో పక్క వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అలాగే, ప్రతీ నియోజకవర్గంలోనూ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇలా ఎన్నికలకు ఇంకా ఏడాది గడువు ఉన్న క్రమంలో జగన్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించే అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
see also:లక్ష మందితో రాజమండ్రిలో అడుగు పెట్టిన వైఎస్ జగన్..!!