వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలతోపాటు సీనియర్ రాజకీయ నాయకులు, అలాగే, టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం వారి మద్దతు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ, అక్కినేని నాగార్జున, యువ హీరోలు నిఖిల్, సుమంత్, నటులు పోసాని కృష్ణ మురళీ, కమెడియన్ పృథ్వీరాజ్‌లు జగన్‌పై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. అంతేకాక, కోలీవుడ్ నుంచి హీరో సూర్య జగన్ అంటే తనకు ఎంత అభిమానమో మీడియా వేదికగా చెప్పాడు. జగన్ ప్రజా సమస్యలపై చేస్తున్న పాదయాత్ర చాలా గొప్పదని, ఒక ప్రజా నేతగా జగన్.. ప్రజల మధ్య తిరుగుతున్నాడని, సమస్యలను పరిష్కరించగల నాయకుడు జగన్ అంటూ హీరో సూర్య చెప్పాడు.
SEE ALSO:వైఎస్ జగన్ పాదయాత్ర మరో చరిత్రాత్మక ఘట్టం..
జగన్‌పై అభిమానాన్ని చాటుకున్న హీరోల్లో తాజాగా మరో కోలీవుడ్ హీరో చేరిపోయాడు. అతనే హీరో విశాల్. అయితే, హీరో విశాల్ శనివారం పచ్చ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలో మాట్లాడుతూ.. జగన్‌పై తన అభిప్రాయాన్న తెలిపాడు. ప్రస్తుతం దేశంలో బీజేపీపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు..? ఆంధ్రలో మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు అన్న పచ్చ మీడియా యాంకర్ కు విశాల్ దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు.
see also:ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ..ఎవరు మాకు పోటి వచ్చిన జిల్లా మొత్తం వైసీపీకే
ఆంధ్ర రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ (ఐ డు లైక్ జగన్) అంటే తనకు ఇష్టమని చెప్పాడు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (ఐ డోన్ట్ లైక్ సీఎం చంద్రబాబు) ప్రభుత్వం అంటే తనకు ఇష్టం లేదని విశాల్ చెప్పాడు. ఇలా జగన్ కు మద్దతు తెలిపిన సినీ హీరోల్లో విశాల్ కూడా చేరిపోయాడు.