బాలీవుడ్‌టాప్ హీరోయిన్స్‌లో ముందు ఉండే పేరు కత్రినా కైఫ్‌దే. ఏళ్లు గడుస్తున్నా.. చెక్కు చెదరని అందాన్ని మెయింటెన్ చేయడంతోపాటు పాటల్లో అదరగొట్టే భంగిమలతో అలరిస్తోంది. దీంతో పాటు కత్రినా చిత్రాల్లో..కత్రినావేసేన స్టెప్పులతో ఆ పాటలకు మాంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టాయి. కత్రినా కైఫ్ కేవలం వెండితెరమీదనే కాకుండా, పలు కార్యక్రమాల్లోనూ స్టెప్పులేస్తూ ఉత్సాహపరుస్తూ ఉంటుంది.
see also:మహేష్ న్యూ లుక్ కి ఫాన్స్ ఫిదా..!!
అయితే, కత్రినా కైఫ్ కార్యక్రమాల్లో డ్యాన్స్ చేయాలంటే ఎంతోకొంత ముట్టచెప్పాల్సిందే. తాజాగా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నలుగురు హీరోయిన్లతో ఆడి పాడేందుకు యూఎస్ వెళుతున్న విషయం తెలిసిందే. జాక్విలీన్ ఫెర్నాండీస్, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, డైజీషా ఉన్నారు. దబాంగ్, ద 2 రీలోడ్ పేరుతో ఎనిమిది రోజులపాటు జరిగే మేజర్ ఈవెంట్స్‌లో తమ స్పెప్పులతో అలరించనున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్ తరువాత కత్రినా కైఫ్‌దే అత్యధిక పారితోషకమట. కత్రినా కైఫ్‌కు రూ.12 కోట్లు, సోనిక్షి సిన్హాకు 8, జాక్విలీన్ ఫెర్నాండీస్‌కు ఆరు కోట్లు ముట్టచెప్పనున్నారట.