ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అద్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైవీ నిప్పులు చెరిగారు. కేవలం దోచుకోవడం కోసమే కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం అవినీతిమయం అని, ముడుపుల మాయగా అభివర్ణించారు. ప్రాజెక్టు పేరుతో ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. 2019లోపు పోలవరాన్ని కేంద్రమే నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీల అమలకు తుది వరకూ పోరాడతామని వైవీ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వేజోన్ హామీలను కేంద్రం నెరవేర్చేంత వరకూ తమ పోరాటం ఆగదని తెలిపారు.
see also:వైఎస్ జగన్ పాదయాత్ర మరో చరిత్రాత్మక ఘట్టం..
అంతేకాదు గత ఎన్నికల్లో 15 స్థానాల్లో టీడీపీని నెగ్గిస్తే అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ప్రజలను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. పశ్చిమ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందులో భాగంగానే వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన లభించిందని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఈ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా..ఎవరు మాకు పోటి వచ్చిన చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.