వైసీపీ అధినేత ,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండా ,వానా అని తేడా లేకుండా ఏపీ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ పాదయాత్ర ఇవాల్టికి 185వ రోజుకి ముగిసింది .ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలోనే జగన్ పాదయాత్ర చేస్తున్న దారిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. జిల్లాలోని మార్కండేయపురంలో జగన్, పవన్ కలిసి ఉన్న ఫ్లెక్సీలను జగన్ అభిమానులు ఏర్పాటు చేశారు. అటు చంద్రవరంలో బాలకృష్ణ, జగన్, వీరిద్దరి మధ్యలో మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఈ ఫ్లెక్సీలో జగన్ చిరునవ్వు చిందిస్తూ ఉంటే.. బాలయ్య మాత్రం మీసాన్ని మెలేస్తున్న ఫొటోను పెట్టడం విశేషం. ‘‘పవన్ అంటే ప్రాణమిస్తాం… జగన్ అంటే ప్రేమిస్తాం’’ అంటూ ఫ్లెక్సీలు దర్శనం ఇచ్చాయి.అయితే ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.